కమడియన్‌గా 'అష్టా చెమ్మా' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు అవసరాల శ్రీనివాస్. నటుడిగా తనదైన స్టైల్‌లో మెప్పించాడు. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో డైరెక్టర్‌గానూ అవతారమెత్తాడు. తొలి సినిమాతోనే కూల్‌గా హిట్ కొట్టాడు. తర్వాతి సినిమా 'జ్యో అచ్చుతానంద' అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. అలాగే కమెడియన్‌గా కూడా తన సత్తా చాటుతున్నాడు. నానితో అవసరాల శ్రీనివాస్‌కి మంచి అనుబంధం ఉంది. ఒకే సినిమాతో ఈ ఇద్దరూ ఒకేసారి తెరంగేట్రం చేశారు. హీరోగా నాని హిట్లు మీద హిట్లు కొడుతూ జోరు మీదున్నాడు. డైరెక్టర్‌గా చేసిన రెండు సినిమాలూ మంచి విజయం సాధించాయి అవసరాల శ్రీనివాస్‌కి. ఈ ఇద్దరు సక్సెస్‌ఫుల్ పర్సన్స్ కాంబినేషన్‌లో తాజాగా ఓ చిత్రం తెరక్కెనుంది. ఎప్పట్నుంచో నానితో సినిమా తెరకెక్కించాలని అనుకుంటున్నాడు అవసరాల. 'జ్యో అచ్చుతానంద' సినిమాలో అవసరాల కోసం చిన్న గెస్ట్ రోల్ కూడా పోషించాడు నాని. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ హీరోగా అవసరాల డైరెక్షన్‌లో నటించనున్నాడు. అన్నట్లు ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో అవసరాల శ్రీనివాస్ హ్యాట్రిక్‌కి సిద్ధమైపోతున్నాడని గుసగుసలాడుకుంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.