త్రివిక్రమ్‌ కొత్త స్ట్రాటజీ అదిరింది బాస్‌.!

By Inkmantra - March 22, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

'అత్తారింటికి దారేది' సినిమాతో సీనియర్‌ నటి నదియాని ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం తీసుకొచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఈ సినిమాతో నదియాకి నటిగా మంచి గుర్తింపు దక్కడంతో పాటు, అవకాశాలు కూడా జోరుగానే వచ్చాయి. పవన్‌ కళ్యాణ్‌కి అత్తగా నటించిన నదియా అందరికీ అత్తయిపోయింది ఆ తర్వాత. త్రివిక్రమ్‌ 'అఆ' సినిమాలోనూ నదియాకి అవకాశమిచ్చాడు. ఈ రెండు సినిమాలూ సూపర్‌ డూపర్‌ హిట్స్‌ ఇచ్చాయి త్రివిక్రమ్‌కి. 

 

'అజ్ఞాతవాసి'కి సీనియర్‌ నటి ఖుష్బూని తీసుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. 'అరవింద సమేత'లో సీనియర్‌ నటి దేవయాని నటించింది. రిజల్ట్‌ అంతంత మాత్రమే. ఇక ఇప్పుడు త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌తో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో తనకి రెండు హిట్లు ఇచ్చిన నదియా కోసం ఓ గెస్ట్‌ రోల్‌ని సిద్దం చేశాడట. ఈ మ్యాటర్‌ అటుంచితే ఈ కొత్త సినిమాకి మరో సీనియర్‌ నటిని హైలైట్‌ చేయాలనుకుంటున్నాడట త్రివిక్రమ్‌. 

 

ఒకప్పుడు కుర్రాళ్ల మదిని దోచేసిన ముద్దుగుమ్మ టబుని ఈ సినిమాలో బన్నీకి అమ్మ పాత్ర కోసం తీసుకోనున్నానడనే ప్రచారం జరుగుతోంది. అమ్మ పాత్ర కోసం నదియానే ఎంచుకోవాలనుకున్నాడట కానీ, ఫ్రెష్‌ అప్పీల్‌ తీసుకురావడం కోసం టబుతో సంప్రదింపులు జరుపుతున్నాడనీ సమాచారమ్‌. అంటే ఈ ఇద్దరి సీనియర్‌ ముద్దుగుమ్మల గ్లామర్‌ స్ట్రేటజీ సినిమాకి ఎంత హైలైట్‌ అవుతుందో కానీ, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌ అయితే ఇటు బన్నీకీ, అటు త్రివిక్రమ్‌కీ బాక్సాఫీస్‌ బద్దలుకొట్టే హిట్‌ కొట్టి తీరాల్సిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS