త్రివిక్రమ్, పవన్, నితిన్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఎప్పుడో అనౌన్స్ అయ్యింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తున్నాడు. పవన్‌కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్నాడు. నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌తో కలిసి, పవన్‌కళ్యాణ్ సొంత బ్యానర్ అయిన పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం గమనించదగ్గ అంశం. కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. త్రివిక్రమ్, నితిన్‌తో 'అఆ' సినిమా చేశాడు. గత కొంతకాలంగా పవన్‌కళ్యాణ్‌కి నితిన్ వీరాభిమానిగా మారిపోయాడు. తన ప్రతీ సినిమాలోనూ నితిన్ ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్‌ని ఇమిటేట్ చేస్తూనే ఉంటాడు. రాబోయే కొత్త సినిమా 'లై'లో అయితే పవన్ కళ్యాణ్‌ని స్టైల్‌లో మక్కీకి మక్కీ దించేశాడు కూడా. అయితే ఈ సారి పవన్ బ్యానర్‌లోనే నితిన్ నటించడం విశేషం. బ్యానర్ వాల్యూ పరంగా ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ కానుంది. సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి చేయనుంది చిత్ర యూనిట్. మరో పక్క నితిన్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'లై' ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ నటుడు అర్జున్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌తో నితిన్ ఇప్పటికే సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.