త‌మ‌న్ క‌ల తీర్చిన త్రివిక్ర‌మ్‌.

By Gowthami - January 25, 2020 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

సంగీత ద‌ర్శ‌కుడిగా సెంచ‌రీ కొట్టాడు త‌మ‌న్‌. ఈ ప్ర‌యాణంలో దాదాపు అగ్ర హీరోలంద‌రితోనూ ప‌నిచేశాడు. అయితే.. ప‌వన్ క‌ల్యాణ్ చిత్రానికి మాత్రం సంగీతం అందించ‌లేక‌పోయాడు. ఈ లోటు లోటుగానే మిగిలిపోయింది. ప‌వ‌న్ అంటే త‌న‌కు చాలా అభిమాన‌మ‌ని, త‌న ప్ర‌సంగాలు చూసి ఉప్పొంగిపోయేవాడిన‌ని చెప్పేవాడు త‌మ‌న్‌. అయితే ఆ కోరిక త్రివిక్ర‌మ్ వ‌ల్ల తీరింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా పింక్ రీమేక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

 

ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి పింక్ మాతృక‌లో ఒకే ఒక్క పాటుంది. ఈ సినిమాలో మాత్రం 5 పాట‌లున్నాయ‌ట‌. ఈ సినిమాలో త‌మ‌న్‌కి ఛాన్స్ రావ‌డానికి కార‌ణం.. త్రివిక్ర‌మ్ అని తెలిసింది. త్రివిక్ర‌మ్ సూచ‌న మేర‌కే ప‌వ‌న్ త‌మ‌న్‌కి ఛాన్సిచ్చాడ‌ని తెలుస్తోంది. ఈమ‌ధ్య త్రివిక్ర‌మ్ టీమ్‌లో త‌ర‌చూ క‌నిపిస్తున్నాడు త‌మ‌న్‌. అల వైకుంఠ‌పుర‌ములో విజ‌యంలోనూ త‌మ‌న్ పాత్ర ఉంది. ఇప్పుడు ఈ రూపంలోనూ త‌మ‌న్‌కి త్రివిక్ర‌మ్ స‌హాయ ప‌డుతున్నాడ‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS