సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన చిత్రం `డీజే టిల్లు`. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మంచి టాకే వచ్చింది. వసూళ్ల పరంగా.. జోరుగా ఉంది. `ఖిలాడీ`తో పోలిస్తే.. డీజే టిల్లు థియేటర్లే హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమా హిట్టయితే... సీక్వెల్ కూడా తీస్తామని, డీజే ఫ్రాంచైజీ కొనసాగిస్తామని చిత్రబృందం ముందే చెప్పింది. అంటే.. ఇప్పుడు సీక్వెల్ ఆశించొచ్చన్నమాట. డీజే టిల్లు క్లైమాక్స్ లో కూడా సీక్వెల్ కి లీడ్ వదిలారు. సో.. సీక్వెల్ ని అతి త్వరలోనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
ఈ సినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. నిజానికి ముందు ఈ సినిమాని నిర్మాతలు వీళ్లు కాదు. సినిమా అంతా పూర్తయ్యాక సితార చేతికి వచ్చింది. సితార ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని నెత్తిమీద ఎత్తుకున్నాక... ఆ సంస్థ ఆస్థాన దర్శకుడు త్రివిక్రమ్ చేయి వేశారు. ఆయన కొన్ని కీలకమైన మార్పులు చేర్పులూ సూచించారు. తమన్ ని తీసుకొచ్చి, అనిరుథ్ తో పాట పాడించడం, కొన్ని సీన్లు రీషూట్ చేయడం.. ఇవన్నీ కలిసొచ్చాయి. అలా.. ఈ సినిమా హిట్టుకు త్రివిక్రమ్ చేయి కూడా పడింది. సీక్వెల్ కథలోనూ.. త్రివిక్రమ్ జోక్యం ఉండడం ఖాయం.