మాటలతో మ్యాజిక్ చేసే రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ బిజినెస్ రూట్ మార్చేశాడు. హీరోలైనా, డైరెక్టర్లైనా ఎవరైనా సరే, సినిమాల్లో వచ్చే సొమ్ములో ఎంతో కొంత బిజినెస్‌లో పెట్టడం పరిపాటే. అలా చాలా మంది సినీ ప్రముఖులు బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. తాజాగా మనం త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈయన విషయానికొస్తే, ఎక్కువగా రియల్ ఎస్టేట్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతుంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలా ఇప్పటికే ఆయన చాలా ప్రాపర్టీస్ వెనకేసేశారు. ఇక తాజాగా ఆయన ఫిలిం ఎగ్జిబిషన్ ఫీల్డ్‌లోకీ ఎంట్రీ ఇచ్చారట. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరంలో రాయుడు ధియేటర్‌ని కొనుగోలు చేశారట.
పల్లెటూళ్లలో ధియేటర్స్ అంటే ఎలా ఉంటాయి చెప్పండి. అందుకే ఈ ధియేటర్‌ని కొనుగోలు చేసిన త్రివిక్రమ్, దాన్ని అల్ట్రామోడ్రన్ రేంజ్‌లో రీ మోడలింగ్ చేయిస్తున్నారట. సిటీల్లో ఉండే ధియేటర్స్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ధియేటర్‌ని ముస్తాబు చేయిస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే పలువరు హీరోలు హైద్రాబాద్‌లో మల్టీఫ్లెక్స్ ఓనర్స్‌గా చెలామణి అవుతున్నారు. ఈ మధ్య మహేష్‌బాబు 'ఏఎంబీ సూపర్‌ఫ్లెక్స్' ధియేటర్స్ గురించి కథలు కథలుగా విన్నాం కదా. హీరోలిలా మల్టీఫ్లెక్సులూ, సూపర్ ఫ్లెక్సులూ అంటుంటే, మన డైరెక్టర్లు మాత్రం ఇంకా సింగిల్ ధియేటర్స్ పైనే దృష్టి పెడుతున్నారు. అవునులెండి అందరూ మల్టీప్లెక్సే అంటే, మరి చిన్న ధియేటర్స్‌ని పట్టించుకునేదెవ్వరు.? అందుకే త్రివిక్రమ్ బాబాకీ జై. ఇదిలా ఉంటే, వినాయక్, తేజ తదితర డైరెక్టర్లు ఆల్రెడీ ఇలా సింగిల్ ధియేటర్స్ ఓనర్స్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.