త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' సినిమా చేస్తోన్న విషయం విదితమే. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోంది ఈ సినిమా. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న 'అల వైకుంటపురములో' తర్వాత, త్రివిక్రమ్ చేయబోయే సినిమా ఏంటి.? అన్నదానిపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. నిజానికి, చిరంజీవి హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా చేయాల్సి వుంది. 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమయంలోనే చరణ్ ఈ సినిమాని అనౌన్స్ చేశాడు. సో, ఆ సినిమానే త్రివిక్రమ్ తదుపరి వెంచర్ కాబోతోందన్నమాట.
మరోపక్క, 'పింక్' రీమేక్‌లో పవన్ నటించబోతున్నాడనీ, త్రివిక్రమ్ ఆ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడనీ ప్రచారం జరుగుతోంది. వేణు శ్రీరామ్ పేరు తొలుత విన్పించినా, తాజా ఊహాగానాలు త్రివిక్రమ్ పేరుని హైలైట్ చేస్తున్నాయి. మరోపక్క, యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇవన్నీ ఓ పక్కన పెడితే, చరణ్ ఎప్పటినుంచో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలోనే ఆలోచనతో వున్నాడన్నది ఓపెన్ సీక్రెట్.
పవన్ కళ్యాణ్ నిర్మాతగా, చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా 2020లో పట్టాలెక్కుతుందనే కొత్త గాసిప్ ఇప్పుడు సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. మొత్తమ్మీద, అందరికీ త్రివిక్రమ్ కావాలి.. కానీ, త్రివిక్రమ్ ఎడా పెడా సినిమాలు చేసేసే రకం కాదు.!