ఎవరేమనుకున్నా డోన్ట్‌ కేర్‌: రకుల్‌

మరిన్ని వార్తలు

నటి, నిర్మాత మంచు లక్ష్మితో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి చాలా మంచి స్నేహం వుంది. ఆ మాటకొస్తే, మంచు లక్ష్మి మంచి మనసుకి ఎవరైనా ఆమెతో స్నేహంలో పడిపోవాల్సిందే. ఆమె చూపించే అప్యాయతని చాలామంది చాలా గొప్పగా చెబుతుంటారు. అలా రకుల్‌, తనకు మంచు లక్ష్మితో వున్న మంచి అనుబంధాన్ని చాటుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫొటో పోస్ట్‌ చేసింది. 

బ్లాక్‌ అండ్‌ వైట్‌లో వున్న ఫొటో అది. అయితే, చాలామంది ఆ ఫొటోని ట్రాల్‌ చేశారు. 'లెస్బియన్స్‌' అంటూ విమర్శలు చేశారు. దాంతో రకుల్‌ డీలా పడిపోలేదు, మరింత ఘాటుగా సమాధానమిచ్చింది.. అదీ ఇంకో ఫొటోతో. ఈ ఫొటో కూడా హాట్‌గానే వుంది. హాట్‌ అంటే హాట్‌, స్టైలిష్‌ అంటే స్టైలిష్‌ అంతే. ఈ ఫొటోలపై మంచు లక్ష్మి, రకుల్‌ అభిమానుల ఆలోచన చాలా విభిన్నంగా వుంది. స్నేహానికి కూడా పెడార్ధాలు తీయడం ఎంతవరకు సబబు? అని వారు ప్రశ్నిస్తున్నారు. 

కళ్ళల్లో 'కామం' నింపుకుంటే, అన్ని బంధాలూ అసభ్యంగానే కన్పిస్తాయన్నది వారి అభిప్రాయం. గ్లామరస్‌ ప్రపంచంలో వచ్చే విమర్శలు ఎలా వుంటాయో రకుల్‌కీ తెలుసు, మంచు లక్ష్మికీ తెలుసు. 'డోన్ట్‌ కేర్‌' అని లైట్‌ తీసుకోవడంతోనే వీరిద్దరూ సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. రకుల్‌ కేవలం హీరోయిన్‌ మాత్రమే కాదు.. ఫిట్‌నెస్‌ బిజినెస్‌లో అద్భుతాలు చేస్తోంది. 

మంచు లక్ష్మి సంగతి సరే సరి. ఆమె, నిర్మాతగా పలు సినిమాలు నిర్మించింది. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కుమార్తెగానే కాదు, నటిగా తానేంటో ఇప్పటికే నిరూపించుకుని.. సొంత కాళ్ళ మీద నిలబడింది మంచు లక్ష్మి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS