మెగా ఫిలిం పై క్లారిటీ ఇచ్చిన టీఎస్ఆర్!

By iQlikMovies - February 23, 2017 - 17:22 PM IST

మరిన్ని వార్తలు

మెగాస్టార్ పవర్ స్టార్ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని అనౌన్స్ చేసి సంచలనం రేపిన టీఎస్ఆర్ ఈ రోజు ఆ సినిమా పై వస్తున్న అనుమానాలకు చెక్ పెట్టాడు.

ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ, తను ఇద్దరు హీరోలని విడివిడిగా కలిసి ఈ మెగా మల్టీ స్టారర్ గురించి చర్చించానని అలాగే వారిరువురు కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించారు అని తెలియచేశారు. అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యత త్రివిక్రమ్ కి అప్పగించినట్టుగా చెప్పారు.

ఇక ఈ సినిమాకి కథను తయారుచేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నారని. ఒకసారి కథ ఫైనల్ అయ్యాక చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మెగా మల్టీ స్టారర్ మొదలవుతుంది అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోల చేతుల్లో చేరి మూడు చిత్రాలు ఉన్నాయని దానితో ఈ చిత్రం ఎప్పుడు ఉంటుంది అని కరెక్ట్ గా చెప్పలేమని టీఎస్ఆర్ కుండబద్దలు కొట్టేశాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS