సంక్రాంతి రేసులో మ‌రో రెండు సినిమాలు

మరిన్ని వార్తలు

2023 సంక్రాంతి మామూలుగా ఉండ‌దు. కొత్త సినిమాల‌తో క‌ళ‌క‌ళ‌లాడ‌బోతోంది. ఇప్ప‌టికే మూడు సినిమాలు బ‌రిలో ఉన్న‌ట్టు ప్ర‌క‌టించేశాయి. చిరంజీవి 'వాల్తేరు వీర‌య్య‌', బాల‌కృష్ణ 'వీర సింహారెడ్డి', విజ‌య్ 'వార‌సుడు'... రిలీజ్‌కి రెడీ అయ్యాయి.

 

ఇప్పుడు మ‌రో రెండు చిత్రాలూ ఈ జాబితాలో నిలిచాయి. అజిత్ 'తునివు' ఈ సంక్రాంతికే విడుద‌ల చేస్తున్నారు. విజయ్ అంత కాక‌పోయినా.. అజిత్ కి కూడా తెలుగులో మార్కెట్ ఉంది. ఈ సినిమానీ భారీ స్థాయిలో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు యూవీ క్రియేష‌న్స్ నుంచి ఓ చిన్న సినిమా వ‌స్తోంది. 'క‌ల్యాణం క‌మ‌నీయం' అనే ఓ చిన్న చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ గ‌ప్ చుప్ గా పూర్తి చేసింది. సంతోష్ శోభ‌న్ ఇందులో క‌థానాయకుడు. దీన్ని కూడా సంక్రాంతి బ‌రిలోనే నిలిపారు. అలా.. ఈ పండ‌క్కి 5 సినిమాలైతే ఖాయ‌మ‌య్యాయి. వీటిలో బాల‌య్య సినిమా జ‌న‌వ‌రి 12న వ‌స్తోంది. మిగిలిన సినిమాల రిలీజ్ డేట్ల‌లో ఓ క్లారిటీ రావాల్సివుంది. ప్ర‌తీ సినిమాకీ ఒక‌ట్రెండు రోజులైతే గ్యాప్ వచ్చేలా ఉంది. మిగిలిన సీజ‌న్‌లో అయితే... ఏమో గానీ.. సంక్రాంతికి ఈ గ్యాప్ చాలు.

 

అయితే.. డ‌బ్బింగ్ సినిమాల‌కు తెలుగులో పెద్ద‌గా థియేట‌ర్లు ఇచ్చేది లేదంటూ నిర్మాత‌ల మండ‌లి హెచ్చ‌రిస్తోంది. ఆ పంచాయితీ ఎప్పుడు తేలుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS