సమంత 'యూటర్న్‌'లో ఆ ఇద్దరూ

మరిన్ని వార్తలు

అందాల సమంత పెళ్లి కోసం స్మాల్‌ బ్రేక్‌ తీసుకుని ఆ వెంటనే సినిమాలతో బిజీ అయిపోయింది. ఆల్రెడీ 'రంగస్థలం' అనే బిగ్‌ డిఫరెంట్‌ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. ఇది కాక మహానటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతోన్న 'మహానటి' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇవన్నీ కాక పలు తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా మరో ఛాలెంజింగ్‌ రోల్‌కి ఓకే చేసింది. 

కన్నడలో మంచి విజయం సాధించిన 'యూటర్న్‌' చిత్రం తెలుగు రీమేక్‌లో సమంత నటిస్తోంది. అనిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సమంత చాలా కొత్త తరహా పాత్రలో కనిపించనుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇదో హారర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ సినిమాని తెలుగుతో పాటు, తమిళంలోనూ రూపొందిస్తున్నారు. కాగా 'రాజుగారి గది 2'లో సమంత దెయ్యం అయితే, ఈ సినిమాలో ఓ దెయ్యానికి హెల్ప్‌ చేసే పాత్రలో సమంత నటిస్తుంది. 

రోడ్‌ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజా అప్‌డేట్‌ ఏంటంటే, సమంతతో పాటు, రాహుల్‌ రవీంద్రన్‌, ఆది పినిశెట్టి ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్స్‌లో ఆల్రెడీ ఆది పినిశెట్టి తన సత్తా చాటాడు. 'వైశాలి', 'మలుపు' తదితర చిత్రాల్లో నటించి గతంలో మంచి మార్కులేయించుకున్నాడు ఆడి పినిశెట్టి. ఈ సినిమాలో ఆది పాత్ర ఎలా ఉండబోతోందనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ మధ్య యంగ్‌ అండ్‌ స్టైలిష్‌ విలన్‌గా ఆకట్టుకుంటున్నాడు ఆది. తాజా చిత్రం నటుడిగా ఆదికి మరో మంచి అవకాశం అవుతుందంటున్నారు. 

ఇక రాహుల్‌ రవీంద్రన్‌ విషయానికి వస్తే, ఓ పక్క హీరోగా నటిస్తూనే, డైరెక్షన్‌ ఫీల్డ్‌లో కూడా రాణిస్తున్నాడు. రాహుల్‌ 'హౌరా బ్రిడ్జ్‌', 'దృష్టి' తదితర సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక దర్శకుడిగానూ ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS