సెప్టెంబర్‌ అక్కినేని సినిమాల పండగే పండగ.!

By iQlikMovies - September 11, 2018 - 12:09 PM IST

మరిన్ని వార్తలు

వినాయక చవితి సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ నుండి కొడుకు, కోడలు చైతూ, సమంత ఇద్దరూ ఒకేసారి బరిలోకి దిగుతున్నారు. 13న చైతూ నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' ప్రేక్షకుల ముందుకొస్తోంది. అదే రోజు సమంత నటించిన 'యూటర్న్‌' కూడా బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. 

ఈ రెండింటి సంగతీ అటుంచితే, అక్కినేని కింగ్‌ నాగార్జున నటిస్తున్న 'దేవదాస్‌' చిత్రమూ ఇదే నెల్లో బరిలోకి దిగుతోంది. సెప్టెంబర్‌ 27న 'దేవదాస్‌' రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో నాగ్‌తో పాటు నేచురల్‌ స్టార్‌ నాని కూడా నటిస్తున్నాడు. కాగా ఈ సెప్టెంబర్‌ నెల మొత్తం అక్కినేని ఫ్యామిలీ దత్తత తీసుకున్నారనే చెప్పాలి. అన్నట్లు పనిలో పనిగా అక్కినేని మరో హీరో అఖిల్‌ కూడా ఇదే నెల్లో వస్తాడట. అంటే అఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం నుండి ఫస్ట్‌లుక్‌ కానీ, టైటిల్‌ కానీ ఏదో ఒకటి ఇదే నెల్లో విడుదల చేయనున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌.

 

అఖిల్‌, 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి టైటిల్‌ కానీ, ఫస్ట్‌లుక్‌ కానీ, వేరే ఇతర సమాచారమ్‌ ఏదీ ఇంతవరకూ బయటికి రాలేదు. జస్ట్‌ ఇదో క్యూట్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ అన్న సంగతి మాత్రమే తెలుసు ఇంతవరకూ. అయితే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ఫ్రెష్‌ అప్‌డేట్‌ ఏదో ఒకటి అభిమానుల కోసం రిలీజ్‌ చేసే యోచనలో అక్కినేని ఫ్యామిలీ అండ్‌ అఖిల్‌ చిత్ర యూనిట్‌ ఉన్నారనీ తెలుస్తోంది. 

మొత్తానికి ఈ వార్త అక్కినేని కుటుంబానికి పండగలాంటి వార్తే కదా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS