రెండు కోట్లు డిమాండ్ చేసిన ఉద‌య‌భాను

మరిన్ని వార్తలు

ఉద‌య‌భాను... ఒక‌ప్పుడు బుల్లి తెర‌ని ఊపేసిన యాంక‌ర్‌. సినిమా ఫంక్ష‌న్ ఏదైనా స‌రే.. ఉద‌య భాను ఉండాల్సిందే అనుకునేవారు. ఆ త‌ర‌వాత సినిమాల్లోనూ హ‌డావుడి చేసింది. ఐటెమ్ సాంగుల‌తో అద‌ర‌గొట్టింది. అయితే ఆ త‌ర‌వాత ఉద‌య‌భాను హవా త‌గ్గిపోయింది. అన‌సూయ‌, ర‌ష్మిలాంటివాళ్లు వ‌చ్చాక అస‌లు ఉద‌య‌భాను ప్ర‌స్తావ‌నే మ‌ర్చిపోయారు. అలాంటిది ఉద‌య‌భానుకి ఇప్పుడు బిగ్ బాస్ అవ‌కాశం త‌లుపుత‌ట్టింది. ఈ షోలో ఓ సెల‌బ్రెటీగా పాల్గొనాల‌ని బిగ్ బాస్ టీమ్ ఆహ్వానించింది. 

 

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఉద‌య‌భానుకి ఇది బంగారంలాంటి అవ‌కాశం. నిర్వాహ‌కులు ఎంతిచ్చినా స‌రే.. ఆనందంగా ఒప్పుకుని ఈ షోలో పాల్గొంటుంద‌నుకున్నారంతా. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. బిగ్ బాస్ నిర్వాహ‌కుల్ని పారితోషికం పేరుతో భ‌య‌పెడుతోంది ఉద‌య‌భాను. ఈ షోలో పాల్గొనాలంటే రోజుకి 2 ల‌క్ష‌ల పారితోషికం ఇవ్వాల‌ని డిమాండ్ చేసింద‌ట‌. దాదాపు 100 రోజుల పాటు సాగే పోగ్రాం ఇది. ఆ లెక్క‌న‌.. ఉద‌య‌భాను పారితోషికం 2 కోట్లు అవుతుంది. 

 

విజేత‌గా నిలిచిన‌వాళ్ల‌కు రూ.50 ల‌క్ష‌లు ఇస్తారు. అలా చూస్తే ప్రైజ్ మ‌నీకంటే పారితోషిక‌మే ఎక్కువ‌న్న‌మాట‌. అయితే బిగ్ బాస్ నిర్వాహ‌కులు మాత్రం ఉద‌య‌భాను అడిగినంత ఇవ్వ‌డానికి స‌సేమీరా అంటున్నారు. కావాలంటే రోజుకి 50 వేల చొప్పున చెల్లిస్తామ‌ని అంటున్నారట. లేదంటే మ‌రో ప్ర‌త్యామ్నాయం చూసుకుంటామ‌ని చెబుతున్నారట. మ‌రి ఉద‌య‌భాను ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS