వాల్తేరు వీరయ్యతో చిరంజీవి స్టామినా ఏమిటో టాలీవుడ్ కి మరోసారి తెలిసొచ్చింది. నాన్ రాజమౌళి సినిమాల రికార్డుల్ని... వాల్తేరు వీరయ్య చెరిపివేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌కి ఈ సినిమా భారీ లాభాల్ని తీసుకొచ్చింది. ఇప్పుడు చిరంజీవి తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. చిరంజీవి ఇప్పుడు `భోళా శంకర్`ని శర వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ పనుల్లోనే ఉన్నారు.
మరోవైపు చిరంజీవి కొత్త సినిమాకి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నక్కిన త్రినాథరావుతో ఆయన ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ధమాకాతో ఓ హిట్టు కొట్టిన నక్కిన కూడా ఫామ్ లో ఉన్నాడు. అయితే... చిరుని ఒప్పించడం నక్కినకు అంత తేలికైన విషయం కాదు. నక్కిన సినిమాల్లో ఎక్కువ భాగం... రచయిత ప్రసన్నకుమార్ బెజవాడకు దక్కుతుంది. ఇప్పుడు ఆయన.. వేరే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. నక్కినతో కలిసి ఆయన పనిచేయకపోవొచ్చు. నక్కిన సింగిల్ గా ఇంత పెద్ద ప్రాజెక్టుని హ్యాండిల్ చేయగలడా? అనేది అనుమానమే. ధమాకా ఆర్థికంగా హిట్టయ్యింది కానీ... ఆ సినిమాలోనూ చాలా లోపాలున్నాయి. పైగా వాల్తేరు వీరయ్య తరవాత.. చిరంజీవి మైండ్ సెట్ కాస్త మారి ఉండొచ్చు.
ఈ హిట్ ని కాపాడుకొని, ఫామ్ ని కంటిన్యూ చేయడంపై ఆయన దృష్టి నిలిపారు. సో... నక్కిన ఈ సినిమా కోసం చిరంజీవిని ఒప్పించాలంటే బాగా కష్టపడాల్సిందే. ఈలోగా మరో దర్శకుడు చిరుని కలిసి కథ ఓకే చేయించుకొంటే.. నక్కి దారులన్నీ మూసుకుపోతాయి.