ఇంకెవరు.. ఆమె భర్త మిస్టర్ సి అదేనండీ రామ్ చరణే అయ్యుంటాడు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. మెగా కోడలు ఉపాసనకు ఫిలిం ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాల్లోనూ చాలా మంది ప్రముఖులతో మంచి స్నేహం ఉంది. ఆ లిస్టులో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేరు మొదటి వరసలోనే ఉంటుంది. వీరిద్దరూ కలిసి రోజూ జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారట. ఉపాసనకు సానియా ఫిట్నెస్ ఇన్స్ప్రేషన్ అట కూడా తెలుసా.! ఉపాసనే స్వయంగా ఆ విషయం చెప్పింది. ఈ రోజు సానియా మీర్జా బర్త్‌డే.
ఈ సందర్భంగా, సానియాకి విషెస్ చెబుతూ, జిమ్‌లో సానియాతో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేసింది మెగా కోడలు ఉపాసన. అంతేకాదు, 'నా ఫిట్నెస్ ఇన్స్ప్రేషన్, ఫిట్నెస్ విషయంలో నాకు ఇంతగా స్పూర్తి కలిగించినందుకు థాంక్స్ అంటూ.. ఈ రోజు నిన్ను మిస్సవుతున్నా.. సానియా..' అంటూ ఉపాసన పోస్ట్ చేసింది. గతంలోనూ ఉపాసన, సానియాతో కలిసి దిగిన ఫోటోస్‌ని పోస్ట్ చేసింది. తన భర్త చరణ్‌కి సంబంధించి ఆసక్తికరమైన విషయాల్ని 'మిస్టర్ సి' అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేస్తుంటుంది. అలాగే మామగారు చిరంజీవికి సంబంధించి విషయాల్ని కూడా ఫ్యాన్స్‌కి ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది ఉపాసన.