పక్షులు, జంతువుల మీద అత్యంత ప్రేమను కనబరిచే ఉపాసన కొణిదెల దృష్టి మనుషుల వైపు మళ్ళినట్లుంది. మనుషుల్లో ప్రేమ, ఆరోగ్య చైతన్యం కలిగించడమే ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. ‘నిన్ను నువ్వు ప్రేమించుకో’మంటూ ఆమె తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ముందు నిన్ను నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ఇతరులను ప్రేమించే ద ృష్టి అలవడుతుంది. అప్పుడే ఇతరులు కూడా నిన్ను ప్రేమిస్తారు. మానవ సంబంధాలు బలపడాలంటే నిన్ను నువ్వు ప్రేమించడమే తారక మంత్రం అంటూ నిన్నగాక మొన్న ట్వీట్ చేసిన ఆమె తాజాగా పోలీసులకు యోగా పాఠాలు బోధిస్తూ కనిపించారు.
It’s an honour to contribute towards the mental & physical well-being of the @TelanganaPolice along with @eddiestern 🙏🏼
— Upasana Konidela (@upasanakonidela) February 17, 2020
We look forward to a healthier (mentally & physically)Police force under the leadership of @CPHydCity @HospitalsApollo @ApolloFND pic.twitter.com/Rz5zeirCwo
ఆరోగ్యమే మహాభాగ్యం అందుకు యోగా కావాలంటూ ఆమె యోగా గురువు ఎడ్డీ స్టెర్న్‌తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. యోగాలో ఎడ్డీకి మంచి చరిత్రే ఉంది. ఆయన న్యూయార్క్ వాసి. మైసూర్ స్కూల్ ఆఫ్ యోగాలో అష్టాంగమార్గాన్ని అభ్యసించారు. వేదాలను చక్కగా అధ్యయనం చేశారు.ఆయన ఉపాన్యాసాలు, రాసిన పుస్తకాలు అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. నిరంతరం విధుల్లో అలుపెరుగకుండా ఉండే పోలీసులకు యోగా అవసరమని భావించిన ఉపాసన అపోలో ఫౌండేషన్ తో కలిసి ఈ యోగా సదస్సు నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారి అంజని కుమార్ ఈ కార్యక్రమానికి తనవంతు సహకారాన్ని అందించారు.