మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ప్రస్తుతం ‘బాక్సర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వైజాగ్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా, నెక్స్‌ట్ షెడ్యూల్‌ని హైద్రాబాద్‌లో ప్లాన్ చేస్తోంది. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో విలక్షణ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడనీ తెలుస్తోంది. ఓ స్టన్నింగ్ రోల్‌లో ఉపేంద్ర కనిపించనున్నారట. అఫ్‌కోర్స్ ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగ టాలెంట్ ఉన్న నటుడు ఉపేంద్ర.
కన్నడ స్టార్ అయినా ఈయనకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఉపేంద్ర కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అళ్లు అర్జున్ ` ఉపేంద్ర మధ్య వచ్చే సన్నివేశాను చాలా పవర్‌ఫుల్‌గా చిత్రీకరించాడు త్రివిక్రమ్ ఆ సినిమాలో. అలాగే ఇప్పుడు మరో మెగా హీరో అయిన వరుణ్ తేజ్ సినిమా కోసం ఉపేంద్ర తెలుగులో కనిపించనున్నాడనీ తెలుస్తోంది.
అయితే, ఆయన పాత్రేంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే. అన్నట్లు ఈ సినిమాలో వరుణ్ తేజ్‌ని ఢీ కొట్టబోయే విలన్ పాత్రలో యంగ్ హీరో నవీన్ చంద్ర నటించనున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం ఉంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 30న ‘బాక్సర్’ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.