‘ఉప్పెన’ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి వున్నా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. నిజానికి, గత ఏడాది ఏప్రిల్ అనుకున్నా, అప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఆ ఆలస్యం సంగతి పక్కన పెడితే, ఎట్టకేలకు వచ్చే నెలలో, అంటే ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఎలా వుంటుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ సినిమాకి సంబంధించిన పాటలు ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుంది.
పాటలు, సినిమా స్టిల్స్.. ఇవన్నీ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. కాగా, తాజాగా సినిమా యూనిట్ విడుదల చేసిన ఓ స్టిల్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ స్టిల్ ‘లిప్ లాక్’ సీన్‌ని గుర్తు చేస్తోంది. అందులో లిప్ లాక్ లేకపోయినా, రొమాంటిక్ మూడ్.. లిప్ లాక్‌కి దారి తీసేలా వుంది. ఇప్పటిదాకా విడుదలైన అన్ని ప్రోమోస్ ఓ క్యూట్ లవ్ స్టోరీని చూపిస్తోంటే, ఇప్పుడిది ఓ రొమాంటిక్ స్టోరీలా అనిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు ‘ఉప్పెన’ సినిమాతో. ఇదే సినిమాతో హీరోయిన్‌గా తెలుగునాట ఎంట్రీ ఇస్తోంది కన్నడ భామ కృతి శెట్టి. దర్శకుడు బుచ్చిబాబు సనకి కూడా ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. సినిమాపై బజ్ ఇప్పటికే పీక్స్‌కి చేరిన దరిమిలా, తొలి సినిమాతోనే వైష్ణవ్ హీరోగా మంచి విజయాన్ని అందుకునేలానే వున్నాడు.