ఈ మధ్య సినిమాల్లో పాటలేవీ గుర్తుండడం లేదు. ప్రతీ పాటా ఒకేలా ఉంటోంది. అయితే మంచి పాటలు రావడం లేదని కాదు. చాలా అరుదుగానే వస్తున్నాయి. వస్తే మాత్రం... శ్రోతలు ఆ పాటని నెత్తిమీద పెట్టుకుంటున్నారు. అలాంటి పాటల్లో `నీ కన్ను నీలి సముద్రం` పాట ఒకటి. వైష్ణవ్‌తేజ్ నటిస్తోన్న చిత్రం ఉప్పెన. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ సినిమాలోని `నీ కన్ను నీలి సముద్రం` పాటకు విశేష స్పందన వచ్చింది. యూట్యూబ్ లో 150 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి..రికార్డులు సృష్టిస్తోంది. హిందీ, తెలుగు లిరిక్స్‌తో మొదలయ్యే ఈ పాటకు.. తెలుగు లిరిక్స్ శ్రీమణి అందించగా, జావేద్ అలీ ఆలపించాడు. ఇక హిందీ లిరిక్స్ రకీబ్ అలమ్ అందించగా, శ్రీకాంత్ చంద్ర వోకల్స్ అందించాడు. ఈ ఆల్బమ్ నుంచి ఇప్పటి వరకూ మూడు పాటలొస్తే... మూడూ హిట్టయ్యాయి.
అయితే.. ఎవరికీ అందనంత రికార్డ్ మాత్రం ఈ పాటకే దక్కింది. దేవిశ్రీ ప్రసాద్ మాయాజాలం ఇదంతా. ఇంకా ఈసినిమా నుంచి మరో రెండు పాటలు రాబోతున్నాయి. అవి ఏ స్థాయిలో పేలతాయో చూడాలి.