గ్లామ్‌షాట్‌: గ్లామర్‌ కా బాప్‌ ఊర్వశీ రౌతెల్లా.!

By iQlikMovies - January 12, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

రంభ, ఊర్వశి, మేనక అనే ఇంద్రలోక అందాల భామల గురించి వినని వారుండరు. అయితే ఆ అందాలన్నీ కలగలిపి ఈ భూమ్మీదకొచ్చాయా అన్నట్లుండే అందం ఊర్వశీ రౌతెల్లాది. పోలికలో ఏమైన పొరపాటుంటే ఉండొచ్చు కానీ, నిజంగానే ఈ ముద్దుగుమ్మ ఆ స్థాయి పొగడ్తకు అర్హురాలే. అయితే కాలం కలిసొచ్చి హీరోయిన్‌ అయ్యిందనాలో, హీరోయిన్‌ కాకుంటే ఇంకేమై ఉండేదో అనాలో తెలీదు కానీ, అందాన్ని ఆరాధించే ప్రతీ ఒక్కరూ ఊర్వశీ రౌతెల్లా అందానికి దాసులు కాక మానరు.

 

'హేట్‌ స్టోరీ 4'తో బాలీవుడ్‌ ఆడియన్స్‌ని ఫిదా చేసేసింది. అంతకు ముందే 'సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌' మూవీతో ఈ అందాల రాశి ఎంట్రీ ఇచ్చింది. 'హేట్‌ స్టోరీ 4' తో బాగా పాపులర్‌ అయిపోయింది. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోవడం ఈ ముద్దుగుమ్మ హాబీల్లో ఒకటి. ఆ క్రమంలోనే లేటెస్టుగా ఊర్వశీ పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. వైట్‌ అండ్‌ వైట్‌ నైట్‌ డ్రస్సులో క్లీవేజ్‌ సోయగాలను అందంగా ఆరేసి, సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌తో పిచ్చెక్కించేస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS