ఆ వెబ్‌ సిరీస్‌లో సుధీర్‌బాబు.?

By iQlikMovies - February 14, 2019 - 15:19 PM IST

మరిన్ని వార్తలు

వెండితెరపై నటుడిగా నటనకు ఆస్కారమున్న కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు సుధీర్‌బాబు. మహేష్‌బాబుకు బావగా,  సూపర్‌స్టార్‌ కృష్ణకి అల్లుడుగా కాకుండా, తనలోని డిఫరెంట్‌ టాలెంట్‌తో అభిమానుల మనసులో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు సుధీర్‌బాబు.

 

'బాఘీ' సినిమాతో బాలీవుడ్‌లో కూడా సత్తా చాటేశాడు. విలన్‌గా ఆ సినిమాతో మంచి పేరు దక్కించుకున్నాడు. ఎలాంటి ఎమోషన్‌ అయినా ఈజీగా పండేస్తుంది సుధీర్‌బాబు ముఖంలో. విభిన్నంగా ఆలోచించే సుధీర్‌బాబు ఆటిట్యూడే ఇప్పుడు ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు కూడా ఆయన్ని ప్రేరేపించింది. మహేష్‌బాబు దంపతులు సొంత నిర్మాణంలో ఓ వెబ్‌ సిరీస్‌ రూపొందబోతోంది. ఈ వెబ్‌ సిరీస్‌లో సుధీర్‌బాబు నటిస్తున్నాడనీ విశ్వసనీయ వర్గాల ద్వారా తాజాగా ఓ సమాచారమ్‌ అందింది. ఇటీవల ఈ వెబ్‌సిరీస్‌కి 'చార్లీ' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. దీని నిర్మాణ బాధ్యతలు నమ్రతా చూసుకోనుంది.

 

ఈ వెబ్‌ సిరీస్‌లో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌కి సుధీర్‌బాబు ఓకే చేశాడట. 8 ఎపిసోడ్స్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందించనున్నారట. త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనున్న ఈ వెబ్‌ సిరీస్‌లో సుధీర్‌బాబు పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట. అలాగే వెండితెరపై తాను ఇంతవరకూ పోషించిన పాత్రల కన్నా విభిన్నంగా ఉండబోతోందట. అదేంటో త్వరలోనే తెలుస్తుందిలే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS