సైరా విడుదలకు లైన్ క్లియర్ అయినట్టే. ఈ సినిమా విడుదలకు ముందు గందరగోణం నెలకున్న నేపథ్యంలో, రిలీజ్‌కి అడ్డంకులు ఏర్పడతాయేమో అని మెగా ఫ్యాన్స్ ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఇది మంచి వార్తే. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని తెలంగాణ హైకోర్టులో వేసిన పిటీషన్‌ని న్యాయమూర్తి తోసి పుచ్చారు. ఈ సినిమా విడుదల అడ్డుకోవడం కుదర్దని తేల్చేశారు. దాంతో సైరాకి లైన్ క్లియర్ అయ్యింది.
సైరా వంశస్థులకు చిరు, చరణ్‌లు కొంత ఆర్థిక సహాయం చేస్తానని మాట ఇచ్చారని, అందుకు సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగాయని, అయితే ఇప్పుడు ఆర్థిక సహాయం ఇవ్వకుండానే సినిమాని విడుదల చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇలాంటి కేసులు సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలని, సినిమా విడుదలకూ, ఆర్థిక లావాదేవీలకు ముడి వేయడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. దాంతో పిటీషన్‌దారులకు ఎదురు దెబ్బతగిలినట్టైంది.