దిల్ రాజు ఈమధ్య బాలీవుడ్ పై దృష్టి పెట్టారు. ఇక్కడి సినిమాల్ని హిందీలో రీమేక్ చేసే సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. తెలుగులో విజయవంతమైన `జెర్సీ`ని ఇప్పటికే బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. నాని నిర్మాతగా రూపొందిన `హిట్` హిందీ రీమేక్ రైట్స్ ఆయన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు `వి` సినిమానీ హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నార్ట.
నాని - సుధీర్ బాబు కథానాయకులుగా నటించిన చిత్రం `వి`. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. త్వరలోనే అమేజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది. దాదాపు 33 కోట్లకు ఈ సినిమాని కొనేశారని టాక్. ఒకట్రెండు రోజుల్లో డిజిటల్ ప్రమోషన్లు కూడా మొదలుకాబోతున్నాయట. ఈమధ్యనే `వి` సినిమాని కొంతమంది బాలీవుడ్ నిర్మాతలకు చూపించాడట దిల్ రాజు. వాళ్ల భాగస్వామ్యంతోనే ఈసినిమాని హిందీలో రీమేక్ చేస్తారని తెలుస్తోంది.