న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోగా నటించిన 'V' సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే థియేట్రికల్ రిలీజ్ కాకుండా ప్రముఖ ఓటీటీ వేదికైన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ సినిమా విడుదల అవుతోంది. ఇప్పటికే ప్రోమోస్ ద్వారా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. నాని కెరీర్లో 25వ చిత్రం కావడం, నాని నెగిటివ్ రోల్ పోషించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా ఈ మధ్య రిలీజ్ అయిన 'V' ట్రైలరుకు కూడా ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన దక్కింది. ఇలా ఉంటే అసలు ఈ సినిమా టైటిల్ 'V' అర్థం ఏంటని సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. 'V' అనేది ఒక అక్షరం కావడంతో దానికి ఎక్కువ మంది విలన్ అనే టైటిల్ గెస్ చేస్తున్నారు. ఈమధ్య ఈ సినిమా హీరోయిన్ నివేద థామస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్ గురించి ఒక హింట్ ఇచ్చింది. 'V' సినిమా టైటిల్ కు అర్థం ఏంటి అని అడిగినప్పుడు, విక్టరీ అనుకోవచ్చు అని చెప్పింది. అయితే దాన్ని పూర్తిగా ఖరారు చేయకుండా సినిమా చూస్తే ఆ టైటిల్ కి ఉన్న అర్థం పూర్తిగా తెలుస్తుందని ముగించింది.
సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.