ఉప్పెనతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. `ఉప్పెన` విడుదల కాకముందే... క్రిష్ సినిమాలో నటించే ఆఫర్ కొట్టేశాడు వైష్ణవ్. ఆ సినిమా ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వచ్చిందట.
వైష్ణవ్ త్వరలోనే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నాడట. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఓ కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడని టాక్. మరోవైపు.. నాగార్జున కథానాయకుడిగా `బంగార్రాజు` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మరో హీరో కూడా కావాలి. ఆ పాత్రలో నాగచైతన్య నటిస్తాడని చెప్పుకున్నారు. అయితే నాగచైతన్య కాల్షీట్లు ప్రస్తుతం అందుబాటులో లేవు. అందుకే మరో హీరోని వెదుక్కోవాల్సి వచ్చింది. ఆ పాత్ర కూడా వైష్ణవ్ తేజ్ కి దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది.