ఈమధ్య విశాల్ సినిమాలు తరచూ వివాదాలకు గురవుతున్నాయి. తన సినిమా విడుదల ముందు.. ఏదో ఓ అడ్డంకి ఏర్పడుతూనే ఉంది. తాజాగా `చక్ర` సినిమాకీ ఇలాంటి తలనొప్పి వచ్చింది. విశాల్ నటించిన కొత్త చిత్రం `చక్ర`. ఈనెల19న విడుదలకు సిద్ధమైంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమా విడుదల డైలామాలో పడింది. ఈ సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.
ఈ సినిమా కథపై నాకే హక్కు ఉందంటూ ఓ నిర్మాత మద్రాస్ హై కోర్టుని ఆశ్రయించాడు. మంగళవారం వాదోపవాదాలు విన్న హైకోర్టు... తీర్పుని గురువారానికి వాయిదా వేసింది. అయితే.. ఈనెల 19న సినిమా విడుదల. 18న కోర్టు తీర్పుని బట్టి, ఈ సినిమా విడుదల ఉంటుందా, లేదా? అనేది తెలుస్తోంది. విశాల్ గత చిత్రం `యాక్షన్`... భారీ నష్టాల్ని మిగిల్చింది. బయ్యర్లను ఆదుకోవడానికి, నష్టపరిహారం చెల్లించడానికి విశాల్ ఈ సినిమా తీశాడు. ఇది కూడా ఇప్పుడు చిక్కులలో పడినట్టైంది.