ఓటీటీ స్టార్ అయిపోయాడు సత్యదేవ్. తన 47 రోజుల్లో, ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య, గువ్వ గోరింక... నేరుగా ఓటీటీలోనే విడుదల అయ్యాయి. ఓటీటీ కోసం రెండు వెబ్ సిరీస్ లూ చేశాడు సత్యదేవ్. ఇప్పుడు మరోసినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే.. తిమ్మరుసు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నీ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి.
థియేటర్లు తెరచుకుని, మళ్లీ కొత్త సినిమాల తాడికి మొదలవ్వడానికి సమయం పడుతుంది. మరోవైపు ఈ సినిమాకి ఆకర్షణీయమైన ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయట. ఆహా. జీ 5 లాంటిసంస్థలు మంచి రేటు ఆఫర్ చేస్తున్నార్ట. దాంతో.. ఓటీటీకి ఇచ్చేస్తే బాగుంటుందని నిర్మాతలూ భావిస్తున్నట్టు సమాచారం. ఈనెలాఖరు వరకూ ఆగి, పరిస్థితిని బేరీజు వేసుకుని, అప్పుడు ఓటీటీకి ఓకే చెబుదామన్నది నిర్మాతల ప్లాన్.