ఆ మెగాహీరో ఎంట్రీకి సుకుమార్‌ రంగం సిద్ధం.!

మరిన్ని వార్తలు

స్టార్‌ హీరోలతో బ్లాక్‌ బస్టర్స్‌ అందుకుంటూనే, తన శిష్యుల సినిమాలను కూడా ఎంకరేజ్‌ చేసే డైరెక్టర్స్‌లో సుకుమార్‌ ముందుంటాడు. ఆల్రెడీ ఇద్దరు శిష్యుల్ని డైరెక్టర్లుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సుకుమార్‌ ఇప్పుడు ముచ్చటగా మూడో శిష్యున్ని రంగంలోకి దించుతున్నాడు. 'కుమారి 21 ఎఫ్‌' చిత్రంతో సూర్య ప్రతాప్‌ని దర్శకుడిగా పరిచయం చేశాడు. అలాగే 'దర్శకుడు' చిత్రంతో హరిప్రసాద్‌ జక్కాతో మెగాఫోన్‌ పట్టించాడు. 

ఈ సినిమాలకు స్క్రిప్టు అందించడంతో పాటు, సుకుమార్‌ నిర్మాణ బాధ్యతలను కూడా తానే స్వయంగా వహించాడు. అయితే 'కుమారి 21 ఎఫ్‌' చిత్రం పాపులర్‌ అయినంతగా 'దర్శకుడు' పాపులర్‌ కాలేదు. ఆ సంగతి అటుంచితే తాజాగా సుకుమార్‌ శిష్యుడి నుండి రాబోతున్న ఈ తాజా ప్రాజెక్టుతో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. 

ఎప్పటి నుండో వైష్ణవ్‌ తేజ్‌ తెరంగేట్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికి అది కుదిరింది. బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'రంగస్థలం' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న మైత్రీమూవీస్‌ బ్యానర్‌తో కలిసి సుకుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'రేయ్‌'తో తెరంగేట్రం చేసినా, రెండో సినిమా 'పిల్లా నువ్వు లేని జీవితం'తో హిట్‌ కొట్టి మాస్‌లో మంచి ఇమేజ్‌ సంపాదించాడు సాయి ధరమ్‌తేజ్‌. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నా, సరైన హిట్‌ ఒక్కటి పడితే మళ్లీ పుంజుకోగల సత్తా ఉన్నోడు తేజ్‌. 

మరి ఈయన సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ అప్పియరెన్స్‌ ఎలా ఉండబోతోందో. త్వరలోనే వైష్ణవ్‌ - సుకుమార్‌ కాంబో చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS