పవన్ కల్యాణ్ సినిమా అంటే మామూలుగా ఉండదు. ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజులో ఉంటుంది. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తరవాత కూడా... ఆ రేంజు తగ్గలేదు. దానికి వకీల్ సాబ్ నే ఉదాహరణ. పింక్ కి రీమేక్ గా తెరకెక్కింది వకీల్ సాబ్. ఈ సినిమాకి గానూ వపన్ కి దాదాపుగా 50 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు టాక్. మరో 30 కోట్లు మేకింగ్ కి ఖర్చు అయ్యిందనుకుంటే.. అదంతా శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలోనే లాగేశాడు దిల్ రాజు. ఇప్పుడు థియేటరికల్ రిలీజ్ డిటైల్స్ వచ్చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి థియేటరికల్ రైట్స్ ద్వారా దాదాపు 90 కోట్లు వచ్చినట్టు సమాచారం.
ఈమధ్య కాలంలో.. ఈ రేంజు బిజినెస్ మరో సినిమాకి జరగలేదు. నైజాంలో ఈ సినిమా ఏకంగా 26 కోట్లకు అమ్ముడైంది. సీడెడ్‌లో 13 కోట్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర నుంచి మరో 10 కోట్లు రాబట్టారు. రెస్టాఫ్ ఇండియా నుంచి 5.75 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ రైట్స్ ద్వారా మరో 5 కోట్లు లభించాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అజ్ఞాతవాసితో పోలిస్తే.. ఈ రేట్లు చాలా ఎక్కువనే చెప్పాలి. ఈ సినిమా బయ్యర్లకు లాభాలు రాబట్టాలంటే దాదాపు 100 కోట్లు వసూలు చేయాలి.