పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` ఈ సంక్రాంతికి రావాల్సింది. కానీ... షూటింగ్ ఆలస్యం అవ్వడంతో, వాయిదా పడింది. వేసవికి గానీ, `వకీల్ సాబ్` రాడు. అయితే ఈ సంక్రాంతికి.. వకీల్ సాబ్ సందడి ఉంటుంది. టీజర్ రూపంలో. ఈ సంక్రాంతికి `వకీల్ సాబ్` టీజర్ వస్తుందని చిత్రబృందం ప్రకటించింది. జనవరి 1 సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ విడుదల చేశారు. బైక్ మీద.. పవన్, శ్రుతిహాసన్ కలసి వెళ్తున్న స్టిల్ అది. పవన్ లుక్... అభిమానుల్లో జోష్ పెంచేసింది.
బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన `పింక్`కి రీమేక్ ఇది. దిల్ రాజు నిర్మాత. పవన్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయిపోయింది. పవన్ - శ్రుతిలపై ఓ గీతాన్ని తెరకెక్కించాల్సింది. దాన్ని... పక్కన పెట్టినట్టు సమాచారం. ఈ సినిమాలో ఒకే ఒక్క డ్యూయెట్ ఉంటుందని, అది కూడా మాంటేజ్ సాంగ్ అని సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.