సుదీర్ఘ విరామం తరవాత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా `వకీల్ సాబ్`. లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. తిరిగి ఈమధ్యే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. పవన్‌కూడా కొన్ని రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు మరో బ్రేక్ తీసుకున్నాడు. సంక్రాంతికి ఈసినిమా వస్తుందన్నది అభిమానుల ఆశ. దానికి తగ్గట్టే చిత్రబృందం కూడా సమాయాత్తం అయ్యింది. అయితే ఇప్పుడు `వకీల్ సాబ్` సంక్రాంతి ఆశలు ఆవిరైపోయాయి. ఎందుకంటే.. పవన్ తో హీరోయిన్ ట్రాక్ ఇంకా మొదలెట్టలేదు. డిసెంబరులో అది పూర్తి చేసే అవకాశం లేదు. జనవరి నుంచి హీరోయిన్ ట్రాక్ మొదలవుతుంది. ఈ విషయం శ్రుతిహాసన్ నే క్లారిటీ ఇచ్చింది.
వకీల్ సాబ్ లో తాను నటిస్తున్నా అని తేల్చి చెప్పిన శ్రుతి... జనవరి నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నాని క్లారిటీ ఇచ్చింది. అంటే.. మరో 15 - 20 రోజుల పాటు షూటింగ్ ఉంటుందన్నమాట. ఆ తరవాత పోస్ట్ ప్రొడక్షన్ మొదలవుతుంది. ఈ లెక్కన చూస్తే.. సంక్రాంతి బరిలో ఈ సినిమా లేనట్టే. ఫిబ్రవరిలో గానీ, మార్చిలో గానీ విడుదలయ్యే ఛాన్సుంది.