కరోనా... లాక్ డౌన్ గొడవ లేకపోయి ఉంటే, ఈ పాటికి `వకీల్ సాబ్` ప్రమోషన్లు ఓ రేంజులో జరుగుతుండేవి. ట్రైలర్లూ, పాటలతో... టాలీవుడ్ ఊగిపోతుండేది. కానీ... ఏం చేస్తాం? అన్ని సినిమాల్లానే `వకీల్ సాబ్` కూడా కరోనా కాటుకు బలైంది. ఈ సినిమా ఎప్పుడొస్తుందో ఎవ్వరూచెప్పలేని పరిస్థితి. దసరాకు వస్తుందని కొందరు, సంక్రాంతికే అని ఇంకొందరు. కానీ దిల్ రాజు మాత్రం... దసరా కంటే ముందే ఈసినిమాని విడుదల చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్టు తోస్తోంది. ఇటీవల నిర్మాతలంతా.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌నికలుసుకున్నారు. షూటింగులకు వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. మంత్రి కూడా నిర్మాతలకు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు దిల్ రాజు సైతం... `వకీల్ సాబ్` షూటింగ్‌కి ప్లానింగ్ చేసేస్తున్నట్టే తెలుస్తోంది. వకీల్ సాబ్ కీలక షెడ్యూల్ ఒకటి బాకీ ఉంది. అయితే అది ఇండోర్ షూటింగ్. అన్నపూర్ణ స్టూడియోస్‌లో తీర్చిదిద్దిన సెట్లో.. షూటింగ్ జరగాల్సివుంది. అదీ కోర్ట్ సీన్. లాక్ డౌన్ తరవాత కొన్ని నిబంధనలతో షూటింగులకు అనుమతి రావొచ్చు. ఇండోర్ షూటింగ్‌కే ముందు అనుమతులు వచ్చే అవకాశంఉంది. తక్కువ క్రూతో షూటింగ్‌జరుపుకోమంటే... అది వకీల్ సాబ్‌కి ప్లస్. ఎందుకంటే... కోర్టు సీన్‌లో ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులు, క్రౌడ్ అవసరం లేదు. పైగా సోషల్ డదిస్టెన్స్ కొనసాగిస్తూ షూటింగ్ చేసుకోవొచ్చు. పాటలూ, ఫైటింగులు ఎలాగూ ఉండవు కాబట్టి.. వకీల్ సాబ్ షూటింగ్‌కి ఎలాంటి టెన్షనూ లేకపోవొచ్చు.
నిజానికి హీరోయిన్ పార్ట్ షూటింగ్ చేయాల్సివుంది. కానీ.. ఇప్పుడు ఆ అవసరం లేదేమో. పవన్ కల్యాణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మొత్తం తీసేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరోయిన్ ఉన్నా, ఆ పాత్రకు తగిన ప్రాధాన్యం గానీ, డ్యూయెట్లు గానీ లేవని తెలుస్తోంది. వీలైనంత షార్ప్‌గా ఈ షూటింగ్ ని ముగించే అవకాశాలున్నాయి. నిజంగానే ఈ సినిమా సంక్రాంతిని పోస్ట్ పోన్ చేద్దామనుకుంటే, అప్పుడు తీరిగ్గా పవన్ ఫ్లాష్ బ్యాక్, పాటలు, ఫైటింగులు చేసుకోవొచ్చు. అవి లేకపోయినా ఈకథకు వచ్చే నష్టమేమీ లేదు. కాబట్టి దిల్ రాజు రిలాక్స్డ్‌గా ఉన్నాడు.