స్టార్ రైటర్ వక్కంతం వంశీ 'నా పేరు సూర్య' సినిమాతో దర్శకుడిగా మారాడు. రచయితలు దర్శకులుగా మారి సంచలన విజయాల్ని అందుకోవడం కొత్తేమీ కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ ఒకప్పుడు రచయితలే. అయితే వాళ్లలా దర్శకుడగా మారి విజయాన్ని అందుకోలేకపోయాడు వక్కంతం వంశీ. ఓ సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకుని ఉంటే, ఎలా ఉండేదో కానీ, కొంచెం కొత్తగా ఆలోచింది బొక్క బోర్లా పడ్డాడు.
ఇప్పుడీ రచయిత, దర్శకుడు క్రాస్ రోడ్స్‌లో ఉన్నాడు. తిరిగా రచన వైపు వెళ్లాలా.? దర్శకుడిగా ముందుకెళ్లాలా.? ఈ సందిగ్ధం వక్కంతం వంశీని కన్‌ఫ్యూజన్‌లో పడేసింది. వాస్తవానికి వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి సినిమా ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ లైట్ తీసుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అల్లు అర్జున్‌ని ఆశ్రయించాల్సి వచ్చింది వంశీకి.
ఇప్పుడు మళ్లీ వక్కంతం వంశీ ఎన్టీఆర్‌ని ఒప్పించే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. సో, ఎన్టీఆర్ ఇప్పట్లో వక్కంతం వంశీకి లైన్ క్లియర్ చేసే అవకాశం కన్పించడంలేదు. ఈ పరిస్థితుల్లో మరి వక్కంతం వంశీ కోరిక నెరవేరేదెలా.? వేచి చూడాలిక.