ఒక్క దెబ్బకి మూడు పిట్టలు: దటీజ్‌ చరణ్‌ స్ట్రాటజీ.!

By iQlikMovies - January 09, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తాజా చిత్రం 'వినయ విధేయ రామ' ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెబుతూ, సినిమాకి సంబంధించిన సమాచారమ్‌తో పాటు, ఇంకా ఎంతో విలువైన సమాచారాన్ని కూడా రివీల్‌ చేస్తున్నాడు. ఇదో కొత్త స్ట్రేటజీ అనే చెప్పాలి. 

 

నిజానికి చరణ్‌ ప్రస్తుతం చాలా బిజీయెస్ట్‌ హీరో. ఓ పక్క హీరోగా 'వీవీఆర్‌'తో బిజీగా ఉంటూనే, మరో పక్క తండ్రి మెగాస్టార్‌ చిరంజీవితో 'సైరా' నిర్మాణ పనులు కూడా చూసుకుంటున్నాడు. అలాగే ఎన్టీఆర్‌తో 'ఆర్‌ఆర్‌ఆర్‌' మెగా మల్టీ స్టారర్‌ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. జక్కన్న రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. 

 

అందుకే 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్‌ అంశాల్ని ఈ సందర్భంగా చరణ్‌ ప్రస్థావించాడు. అలాగే 'సైరా' మూవీ విశేషాలు కూడా పంచుకున్నాడు. ఈ రకంగా చరణ్‌ రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'వీవీఆర్‌'పై అంచనాలు పెంచేయడంతో పాటు, మిగిలిన రెండు సినిమాలపై కూడా ఇప్పటి నుండే హైప్‌ క్రియేట్‌ చేసేశాడు. దాంతో చరణ్‌ ప్రమోషన్స్‌కి బాగా క్రేజ్‌ వచ్చేసింది. చరణ్‌ నోటి వెంట ఏ విలువైన మాట వస్తుందా అని అంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS