త్రివిక్రమ్‌ బాగా బిజీ.!

మరిన్ని వార్తలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్టర్‌గా మారి సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ని తెరకెక్కించాడు. మంచి సక్సెస్‌లు అందుకుని స్టార్‌ డైరెక్టర్స్‌ లిస్టులోకి చేరాడు. అయితే 'అజ్ఞాతవాసి' నిరాశపరచడంతో త్రివిక్రమ్‌ గ్రాఫ్‌ సడెన్‌గా పడిపోయింది. తర్వాత వచ్చిన 'అరవింద సమేత'తో కాస్త కుదుటపడిన త్రివిక్రమ్‌కి ఇప్పుడు వరుసపెట్టి అవకాశాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్‌ మెగాస్టార్‌ సినిమాకి పని చేయాల్సి ఉంది.

 

ఇక ముచ్చటగా మూడో సినిమా కూడా త్రివిక్రమ్‌ ఖాతాలో ఉంది. అదే విక్టరీ వెంకటేష్‌ మూవీ. వెంకీ కూడా త్రివిక్రమ్‌కి ఛాన్సిచ్చాడట. వాస్తవానికి త్రివిక్రమ్‌ - వెంకీ కాంబినేషన్‌లో ఎప్పుడో సినిమా రావల్సి ఉంది. వెంకీ నటించిన 'మల్లీశ్వరి' సినిమాకి త్రివిక్రమ్‌ మాటలు అందించారు. అప్పటికింకా త్రివిక్రమ్‌ మెగాఫోన్‌ పట్టలేదు. త్రివిక్రమ్‌ డైరెక్టరయ్యాక వెంకీతో సినిమా చేసే ఛాన్స్‌ కుదరలేదు. 

 

కానీ వెంకీ నోట త్రివిక్రమ్‌ మాటలు మాత్రం భలే పేలాయి 'మల్లీశ్వరి' సినిమాలో. ఇక త్వరలోనే త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో నటించి వెంకీ ఆ ముచ్చట కూడా తీర్చేయనున్నాడు. ఇంకా చెప్పాలంటే మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో కూడా త్రివిక్రమ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే దానికింకా టైం పట్టేలా ఉంది. ఇలా త్రివిక్రమ్‌ డైరీ ఫుల్‌గా నిండిపోయింది. మరో మూడు, నాలుగేళ్ల వరకూ త్రివిక్రమ్‌ డైరీ ఖాళీ అయ్యే ప్రశక్తే లేదు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS