వలిమై మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: అజిత్ కుమార్, కార్తికేయ, హుమా ఖురేషి, యోగి బాబు తదితరులు
దర్శకత్వం : హెచ్ వినోద్
నిర్మాత: బోనీ కపూర్
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఎడిటర్ : విజయ్ వేలుకుట్టి


రేటింగ్ : 2.5/5


రజనీకాంత్, కమల్ హాసన్, సూర్యల తర్వాత తెలుగులో మార్కెట్ వున్న హీరో అజిత్. అజిత్ సినిమాలకు ఇక్కడా అభిమానులు వున్నారు. అజిత్ నుంచి సినిమా వస్తుందంటే ఇక్కడా ఎదురుచూసే ఫ్యాన్స్ వున్నారు. ఇప్పుడా ఎదురుచుపుకు కార్తికేయ కూడా తోడయ్యాడు. అజిత్, కార్తికేయ ఇద్దరూ స్క్రీన్ పంచుకున్నారు వలిమై కోసం. మంచి అంచనాలతో ఈ రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్కసారి సినిమా రివ్యూలోకి వెళితే...


కథ :


సైతాన్ స్లేవ్స్ అనే బైక్ రేసింగ్ గ్యాంగ్ కి లీడర్ న‌రేన్ (కార్తికేయ‌) కొంతమంది నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి వాళ్లతో ఓ చీకటి ప్రపంచం క్రియేట్ చేస్తాడు. వైజాగ్ కేంద్రంగా డ్రగ్స్ , చైన్ స్నాచింగ్‌, దోపిడీలు హ‌త్యలు చేస్తుంటుంది ఈ గ్యాంగ్. ఈ గ్యాంగ్ ఆట‌క‌ట్టించేందుకు ఏసీపీ అర్జున్ (అజిత్‌)ను రంగంలోకి దించుతుంది పోలీస్ డిపార్ట్‌మెంట్‌. మరి అర్జున్ సైతాన్ స్లేవ్స్ గ్యాంగ్ అరాచ‌కాల‌ను ఎలా అడ్డుకున్నాడు? ఈ క్రమంలో అత‌నికెదురైన స‌వాళ్లేంటి? అనేది మిగతా కథ. 
  
విశ్లేషణ :


వలిమై ట్రైలర్ చూస్తే ఇదో యాక్షన్ సినిమా అనిపించింది. అంతేకాదు.. బైక్ రేస్ నేపధ్యం అనిపించింది. కారణం ట్రైలర్ లో ఎక్కువ బాగం బైక్ రేసింగ్ కనిపించింది. సినిమాలో కూడా బైక్ రేసింగ్ కే కుంభబాగం.


ఈ క‌థ‌ను ఆద్యంతం బైక్ ఛేజింగ్ తో డిజైన్ చేశాడు ద‌ర్శకుడు వినోద్. సైతాన్ స్లేవ్స్ గ్యాంగ్ దోపిడీలు, హ‌త్యలు చేసే ఎపిసోడ్ల‌తో సినిమాని ప్రారంభించిన తీరు ఆస‌క్తిరేకెత్తిస్తుంది. ఈ క్రమంలో వ‌చ్చే బైక్ రేసింగ్ సీక్వెన్స్ ఆక‌ట్టుకుంటాయి. 


స్వతహాగా బైక్ రేసర్ అయిన అజిత్ అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో పరిచయం.. అతను విశాఖలో అడుగు పెట్టిన త‌ర్వాత కథ ముందుకు వెళ్ళడం, సైతాన్ స్లేవ్స్ గ్యాంగ్‌ను ప‌ట్టుకునే క్రమంలో వ‌చ్చే ఛేజింగ్ ఎపిసోడ్లు, బైక్ స్టంట్స్ ఇవన్నీ యాక్షన్ ని ఇష్టపడే ఆడియన్స్ ని మెప్పిస్తాయి.


అయితే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్యామిలీ ఎపిసోడ్ తో నెమ్మదిగా సాగుతుంది, ఒకదశలో బోరింగ్‌గా కూడా అనిపిస్తుంది. ఇక ముగింపుకు ఒక్కసారికి మళ్ళీ యాక్షన్ ఎపిసోడ్లు అదిరిపోతాయి. ఇండియన్ సినిమాలో ఎన్నడూ లేనంత రిచ్ గా లావిష్ గా యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేశాడు దర్శకుడు. యాక్షన్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకుల వలిమై కన్నుల పండగ లాంటి సినిమా. 


నటీనటులు :


ఏసీపీ అర్జున్ పాత్రలో అజిత్ ఒదిగిపోయాడు. అజిత్ నిజంగానే బైక్ రేస‌ర్. దీంతో ఈ క‌థ‌కు ఆయనకు చాలా నేచురల్ గా షూట్ అయ్యింది. యాక్షన్ సీన్స్ లో ఆయన సాలిడ్ గా కనిపిస్తారు.


విలన్ గా చేసిన కార్తికేయకు ఇచ్చిన ఎలివేషన్ బావుంది. కార్తికేయ లుక్‌, బాడీ పాత్రకు మరింత కలిసోచ్చింది. ఎక్కువ స్ర్కీన్ ప్రజెన్స్ ల‌భించింది. హ్యూమా ఖురేషి పాత్ర బావుంది. క‌థ‌లో ఆమెకు మంచి ప్రాధన్యత వుంది. మిగతా పాత్రధారులు పరిధిమేర చేశారు 


టెక్నికల్ గా :


యువన్ అందించిన సంగీతం బావుంది. ముఖ్యంగా జిబ్రాన్ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో చేసిన స్కోర్ మరింత ఎలివేట్ అయ్యింది. ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్లు డిజైన్ చేసిన టేక్నిషియన్లకు ఎక్కువ మార్కులు పడాతాయి.


నిర్మాణ విలువలు వున్నంతంగా వున్నాయి. దర్శకుడు వినోద్ ఒక యాక్షన్ ఫిల్మ్ ని అందించడంలో సక్సెస్ అయ్యాడు. 


ప్లస్ పాయింట్స్


అజిత్ 
కొత్త నేపధ్యం 
యాక్షన్, రేసింగ్ 


మైనస్ పాయింట్స్


ఫ్యామిలీ ఎపిసోడ్ 
సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించడం 


ఫైనల్ వర్దిక్ట్ : వలిమై.. రేసింగ్ అదిరింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS