మెగా రాకుమారుడు వరుణ్ తేజ్ నటిస్తున్న 'వాల్మీకి' చిత్రాన్ని సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ బ్లాక్ బస్టర్ 'జిగర్తాండ'కు అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌కి జంటగా పూజాహెగ్దే నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంతవరకూ ఏ అప్‌డేట్ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు.
కానీ, ఫ్యాన్స్ నుండి వస్తున్న ఒత్తిడి కారణంగా సినిమా ప్రీ టీజర్‌ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ సోమవారం సాయంత్రం 5 గంటల 18 నిముషాలకు 'వాల్మీకి' ప్రీ టీజర్‌ని విడుదల చేయనున్నామని డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇంట్రెస్టింగ్ అంశమేంటంటే, ఈ ప్రీ టీజర్‌లో డైలాగ్స్ ఉండవట. జస్ట్ హీరో గెటప్ రివీల్ చేస్తారట. హీరోది నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అందర్నీ షాక్ ఇచ్చేలా ఈ ప్రీ టీజర్‌ని డిజైన్ చేస్తున్నారట. ప్రీ టీజర్ ఎందుకు, డైరెక్ట్‌గా టీజరే వదలొచ్చుగా అంటూ ఆత్రం అపుకోలేని అభిమానులు హరీష్ శంకర్‌పై సోషల్ మీడియాలో మళ్లీ ఒత్తిడి తెస్తున్నారట. దాంతో ఈ ప్రీ టీజర్ చూశాక ఫ్యాన్స్‌లో తెలియని కిక్ వస్తుందనీ, ఆ కిక్‌లో మరిన్ని అప్‌డేట్స్ రివీల్ చేస్తామనీ హరీష్ శంకర్ తెలిపారు.