హరీష్ శంకర్‌లో కామెడీ టింజ్ చాలా ఎక్కువే కనిపిస్తుంటుంది. `షాక్` ఫ్లాప్ అయినా, అందులో కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. మిరపకాయ్‌ని నిలబెట్టింది హరీష్ అల్లుకున్న కామెడీ దృశ్యాలే. ఇక గబ్బర్ సింగ్ సంగతి సరేసరి. అంత్యాక్షరి ఎపిసోడ్‌తో ఆ సినిమా రూపు రేఖలే మారిపోయాయి. ఆ తరవాత... అలాంటి ట్రాకులు కథలో పెట్టుకోవడం ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు `వాల్మీకి`లోనూ అలాంటి ట్రాక్ ఒకటి ఉంది.
జిగడ్తాండకు రీమేక్ ఇది. కథలో సినిమాకి సంబంధించిన నేపథ్యం కూడా ఉంది. అందులో భాగంగా ఫిల్మ్ స్కూల్ మాస్టారు, రౌడీలకు పాఠాలు నేర్పించే ట్రాక్ వస్తుంది. జిగడ్తాండలో ఈ ట్రాక్ బాగా పండింది. దాన్ని హరీష్ శంకర్ తనదైన శైలిలో మార్పులూ చేర్పులూ చేసి తీశాడట.
ఈ ట్రాక్ మొత్తం హిలేరియస్‌గా ఉంటుందని, ద్వితీయార్థానికి ఈ ట్రాక్ ఊపు తీసుకొస్తుందని తెలుస్తోంది. రౌడీలకు నటనలో పాఠాలు నేర్పించే గురువుగా బ్రహ్మాజీ కనిపించబోతున్నాడు. తన కామెడీటైమింగ్ గురించి తెలియనిది ఏముంది? ఈమధ్య బ్రహ్మాజీకి సరైన పాత్ర పడలేదు. `వాల్మీకి`తో ఆ లోటు తీరుతున్నట్టే.