పవన్ కల్యాణ్ చుట్టూ తిరిగే దర్శకుల సంఖ్య ఎక్కువవుతోంది. పవన్ వరుసగా సినిమాల్ని ఒప్పుకుంటున్న నేపథ్యంలో.. తమ కథని ఓకే చేస్తే బాగుణ్ణు అనుకుంటూ... కొత్త దర్శకులు కలులు కంటున్నారు. తమ కథల్ని పట్టుకుని.. పవన్ చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా.. మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పవన్‌కి టచ్‌లో ఉంటున్నాడని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి తరచూ పవన్ ని కలుస్తున్నాడని, తాను కథ వినిపించే ప్రయత్నాల్లో ఉన్నాడని టాలీవుడ్ టాక్.
మహర్షి లాంటి సూపర్ డూపర్ హిట్ తరవాత... వంశీ పైడిపల్లికి అనుకోని గ్యాప్ వచ్చేసింది. మహేష్ తో మరో సినిమా చేద్దామని ప్లాన్ చేశాడు గానీ, కుదర్లేదు. ఇప్పుడు వంశీ పైడిపల్లి కథ రెడీ చేసుకున్నా.. హీరోలెవరూ అందుబాటులో లేరు. అయినా సరే.. హీరోలకు కథలు చెప్పి ఒప్పించాలని చూస్తున్నాడు. అందుకే.. పవన్ ని టచ్‌లో ఉంటున్నాడని తెలుస్తోంది. పవన్ కి కథ నచ్చినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓకే చెప్పలేడు. క్రిష్ సినిమా పూర్తి చేయాలి. ఆ తరవాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి లైన్‌లో ఉన్నారు. ఇవన్నీ అయ్యాకే.. వంశీకి ఛాన్స్ ఇవ్వగలడు.