కోలివుడ్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి పేరు ఇప్పుడు హాట్ టాపిక్. కారణం.. విజయ్ తో వంశీ సినిమా ఖాయమవ్వడం. ''మహర్షి'' తర్వాత కొత్త సినిమా ప్రకటన చేయలేదు వంశీ. ఆయన దగ్గర కొన్ని కధలు వున్నాయి. ఐతే హీరో ఫిక్స్ కాలేదు. ఇప్పుడు వంశీ వైపు నుండి ఓ కొత్త కబురు వచ్చింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ తో సినిమా చేయబోతున్నట్లు దృవీకరించారు వంశీ. అంతేకాదు ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త కోలివుడ్ లో వైరల్ అవుతుంది. నేషనల్ అవార్డ్ డైరెక్టర్ తో విజయ్ సినిమా అని జోరుగా కధనాలు వస్తున్నాయి.
వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాకి ప్రాంతీయ చిత్రం కేటగిరీలో జాతీయ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు 'ఊపిరి' సినిమాతో కూడా తమిళ ప్రేక్షకులకు పరిచయమే. ఈ సినిమాని కార్తీ సినిమాగా చూశారు తమిళ ఆడియన్స్. ఆ రకంగా కూడా వంశీకి కోలివుడ్ మార్క్ వుంది. ఇప్పుడు నేరుగా విజయ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు వంశీ. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాపై దిల్ రాజు నిర్మాణ సంస్థ నుండి పూర్తి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది.