ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతుంది. మూడు పాత్రల్లో అంటూ.. మూడు రకాల గెటప్పులు ఉండాలి కదా? అందుకోసం చిత్రబృందం ప్రత్యేక కసరత్తులు చేస్తోంది. ఎన్టీఆర్‌కి మేకప్ వేయడానికి హాలీవుడ్ నుంచి ఓ స్పెషలిస్ట్‌ని రంగంలోకి దింపుతున్నారు. అతను అల్లాటప్పా మేకప్ మెన్ కాదు. హాలీవుడ్ అద్భుతం లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌కి పనిచేసిన సాంకేతిక నిపుణుడు. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న రోబో 2.0 చిత్రానికీ తనే మేకప్ మెన్. అతనే... వాన్స్ హార్ట్ వెల్. ఈరోజు వాన్స్ ఎన్టీఆర్‌నీ, చిత్రబృందాన్ని కలుసుకొని స్క్రిప్ట్ కి సంబంధించిన చర్చలు జరిపాడు. ఈనెల 15 నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. సో.. వాన్స్ పని అప్పటి నుంచే మొదలన్నమాట.