మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'ప్రతిరోజూ పండగే' అనే టైటిల్‌ని పిక్స్ చేశారు. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో తేజుకి జోడీగా అందాల భామ రాశీఖన్నా నటిస్తోంది. కాగా, వరుసగా ఆరు ఫెయిల్యూర్స్ ఇచ్చి, ఇటీవలే 'చిత్రలహరి'తో తేజు బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
అదే జోరులో మారుతితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'భలే భలే మగాడివోయ్' తర్వాత వరుస విజయాలందుకున్న మారుతి 'శైలజారెడ్డి అల్లుడు'తో ఆశించిన విజయం అందుకోలేకపోయాడు. కానీ, ఈ సారి తేజుతో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొస్తున్నాడట. ఖచ్చితంగా హిట్ అయ్యే సినిమా అని నమ్మకంగా చెబుతున్నాడు. తమన్ ఈ సినిమాకి బానీలు అందిస్తున్నాడు.
ఇకపోతే, రాశీఖన్నా, తేజు జంటగా తెరకెక్కిన 'సుప్రీమ్' ఇద్దరికీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. సో సెంటిమెంట్ పరంగా అది కూడా ఈ సినిమాకి పోజిటివ్ వైబ్ అనిపిస్తోంది. టైటిల్ కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. తేజు బాడీ లాంగ్వేజ్‌కి ఈ టైటిల్ సూపర్ యాప్ట్. చూడాలి మరి, తేజు, రాశీఖన్నా జంట మారుతితో కలిసి 'సుప్రీమ్' మ్యాజిక్ రిపీట్ చేస్తారో లేదో.!