సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ వెంకటేష్ ఈరోజు ఉదయం చెన్నై సమీపంలోని తన ఫామ్ హౌస్లో కన్ను మూశారు. ఆయన చెన్నైలోని మెడికల్ కాలేజీలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అభినయ్ కి ఆర్థిక సమస్యలతో పాటు, కుటుంబ సమస్యలు ఉన్నాయని అందుకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై వాణిశ్రీ కుటుంబ సభ్యులు స్పందించడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.