Varasudu, DilRaju: దిల్ రాజుకి త‌ల‌నొప్పిలా మారిన 'వార‌సుడు'

మరిన్ని వార్తలు

తెలుగులోనే కాదు, సౌత్ ఇండియాలోనే అగ్ర‌శ్రేణి నిర్మాత‌గా పేరు తెచ్చుకొన్నారు దిల్ రాజు. ఆయ‌న ప్లానింగ్ అంతా ప‌క్కాగా ఉంటుంది. అయితే.. `వార‌సుడు` సినిమా విష‌యంలో మాత్రం ఆయ‌న ప్ర‌ణాళిక‌లు ఫ‌లిచ‌డం లేదు. ఆ సినిమా త‌న‌కే త‌ల‌నొప్పిగా మారింది.

 

విజ‌య్‌తో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా వార‌సుడు. ఈ సంక్రాంతికి విడుద‌ల చేయాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్. సంక్రాంతి పెద్ద సీజ‌న్‌. ఆ సీజ‌న్ దిల్ రాజుకి బాగా క‌లిసొచ్చింది.

 

ఈ సినిమా కూడా సంక్రాంతి స‌మ‌యానికి సిద్ధం అవుతుంది. కానీ.. విడుద‌ల చేయ‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే... సంక్రాంతి సీజ‌న్‌లో చాలా పెద్ద సినిమాలు వ‌స్తున్నాయి.ఆదిపురుష్‌, వాల్తేరు వీర‌య్య‌తో పాటు బాల‌య్య సినిమా కూడా సంక్రాంతికే రాబోతోంది. ఈ మూడు సినిమాల్నీ నైజాంలో దిల్ రాజునే పంపిణీ చేస్తున్నారు. వాటితో పాటు వార‌సుడూ విడుదల చేస్తే వ‌సూళ్ల‌ని పంచుకోవ‌డం త‌ప్ప మ‌రో మార్గం క‌నిపించ‌దు. వార‌సుడు లాంటి భారీ బ‌డ్జెట్ సినిమాని..ఇలా తీవ్ర‌మైన పోటీ మ‌ధ్య విడుద‌ల చేయ‌డం రిస్కే. అందుకే దిల్ రాజు ఇప్పుడు సెకండ్ ఆప్ష‌న్ కోసం ఎదురు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. సంక్రాంతికి వారం రోజుల ముందే... త‌న సినిమాని విడుద‌ల చేయాల‌నుకొంటున్నార‌ట‌. లేదంటే సంక్రాంతి సినిమాలు వెళ్లిపోయిన వారం రోజుల‌కు విడుద‌ల చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. ఏదేమైనా.. వార‌సుడు రిలీజ్ డేట్ మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS