ఎప్పటి నుండో లేడీ విలన్స్‌కి మంచి పాపులారిటీ ఉంది. అయితే అప్పట్లో లేడీ విలన్స్ అంటే కాస్త వయసు మీరిన వారుండేవారు. కానీ ఇప్పుడలా కాదు, విలక్షణ నటనను ఇష్టపడే ముద్దుగుమ్మలు యంగేజ్‌లోనే విలనిజం చూపించేందుకు ఇష్టపడుతున్నారు. ఈ కోవలో ముందుగా ప్రస్థావించుకోదగ్గ నటి తమిళ ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్‌కుమార్.
హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన వరలక్ష్మీ ఇప్పుడు వరుసగా విలన్ పాత్రలు పోషిస్తోంది. విలన్‌గా మారాక వరలక్ష్మీ పేరు మార్మోగిపోతోంది. తాజాగా వరలక్ష్మి, విశాల్ నటించిన 'పందెంకోడి 2', విజయ్ నటించిన 'సర్కార్' చిత్రాల్లో విలన్ పాత్ర పోషించారు. ఆమె కటౌట్‌కి విలనిజం బాగా పండుతోందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. దాంతో వరుసగా ఆమెకు విలన్ పాత్రలే కట్టబెడుతున్నారు. తమిళంలోనే కాదు, తెలుగులో కూడా నటించేందుకు తాను సిద్ధమేనని ఇటీవల మాటవరసకి ఓ సందర్భంలో వరలక్ష్మి చెప్పింది.
ఇంకేముంది. దాంతో మన తెలుగు దర్శక, నిర్మాతలు కూడా వరలక్ష్మి కోసం స్పెషల్ విలన్ పాత్రలకు స్క్రిప్టు ప్రిపేర్ చేస్తున్నారట. తాజాగా ఓ ప్రముఖ యంగ్ హీరో సినిమాకిగానూ వరలక్ష్మిని విలన్‌గా ఎంచుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమ్. అలాగే తమిళంలో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తున్న వరలక్ష్మి నెక్ట్స్ ధనుష్ సినిమాలోనూ ఆ తరహా పాత్రనే పోషిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారమ్.
ఇకపోతే తెలుగులోనూ వరలక్ష్మి విలన్ ఎంట్రీ షురూ అయితే, తెలుగు సినిమాకి ఓ ఫ్రెష్ అండ్ న్యూ లేడీ విలన్ పరిచయమైనట్లే మరి.