'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి ఈ నెల 22 న రిలీజ్ డేట్ కన్‌ఫామ్ అయ్యింది. అయితే ఈ రిలీజ్ డేట్‌పై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే త్వరలో రాబోయే ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఈలోగా రానే వస్తుంది. వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందంటే, టీడీపీ శ్రేణుల నుండి సినిమాపై అభ్యంతరాలు ఎక్కువవుతాయి.
టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తే సినిమా రిలీజ్‌కి అది పెద్ద అడ్డంకే. కానీ అలాంటి అభ్యంతరాలేమీ ఉండవని ధృవీకరించుకున్నాకే రిలీజ్ డేట్ కన్‌ఫామ్ చేసుకున్నారనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా చంద్రబాబుకీ, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెరకెక్కుతోన్న సినిమా అనేది పక్కా. మరి తెలుగుదేశం శ్రేణుల నుండి అభ్యంతరాలు తలెత్తకుండా ఉండడమనేది సాధ్యమేనా.?
ఇప్పటికే ట్రైలర్ విషయంలోనే ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. అయినా వర్మ కాన్ఫిడెన్స్ ఏంటో అర్ధం కావడం లేదు. వర్మని తక్కువంచనా వేయడానికి లేదండోయ్. ఆయన లెక్కలు ఆయనకుంటాయ్. ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఆయన తలచుకున్న పనిని అనుకున్నట్లే పూర్తి చేయడంలో వర్మ సమర్ధుడు. సో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ కూడా అంతే. అనుకున్న డేట్‌కే రిలీజ్ చేసి చూపిస్తారు ఇది పక్కా.