28 డిగ్రీల సెల్సియస్‌ యాంగిల్‌లో ఏంగ్రీ మేన్‌.!

మరిన్ని వార్తలు

తొలి సినిమా 'అందాల రాక్షసి' నుండే విలక్షణ నటుడిగా స్టాంప్‌ వేయించుకున్న హీరో నవీన్‌చంద్ర. ఆ తర్వాత కూడా విలక్షణ కథలకే ఓటేస్తూ వచ్చాడు. హీరోగానే కాకుండా, విభిన్న పాత్రలను ఆల్రెడీ ట్రై చేసేశాడు. ఇటీవలే జూనియర్‌ ఎన్టీఆర్‌ 'అరవింద సమేత'లో విలన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. విలన్‌గా కనిపిస్తే ఇక వరుసగా విలన్‌ పాత్రల్లోనే కనిపించాలని రూలేం లేదు. 

 

అలాగే హీరో అనిపించుకుంటే హీరో పాత్రలే పోషించాలన్న రూల్‌ అంతకన్నా లేదు ఈ జనరేషన్‌ హీరోలకు. ఆ కోవలో ముందు వరుసలో నిలబడే యంగ్‌ హీరో నవీన్‌ చంద్ర. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం '28 డిగ్రీల సెల్సియస్‌'. లేటెస్ట్‌గా విడుదల చేసిన పోస్టర్‌ ఆశక్తిగా ఉంది. సీరియస్‌గా ఆలోచిస్తున్న హీరో, హీరో తలలోనుండి ప్రశ్నల రూపంలో బయటికి వస్తూ గాలిలో ఎగురుతున్న కాగితాలు, ఆ వెనకే చేతిలో కాఫీ కప్పుతో కోపంగా చూస్తున్న హీరోయిన్‌.. ఇదీ పోస్టర్‌ సారాంశం. 

 

షాలినీ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్‌ విశ్వనాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతోందని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో చెప్పకనే చెప్పేశారు. చూడాలి ఫస్ట్‌లుక్‌తోనే ఏదో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసిన మన హీరో సినిమాతో ఇంకెలాంటి ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేయబోతున్నాడో మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS