వర్ష బొల్లమ్మ.. తెలుగులో పలు సినిమాలు చేసినా, ఆమెకి 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో ఆమె సహజ నటనకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మామూలుగా హీరోయిన్ అంటే గ్లామర్ వుండాలి. వర్ష బొల్లమ్మ మాత్రం, గ్లామర్ కంటే యాక్టింగ్ టాలెంట్‌నే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. 'గ్లామర్ విషయంలో నాకంటూ కొన్ని బౌండరీస్ వున్నాయి. ప్రస్తుతానికి గ్లామరస్ పాత్రలు చేయాలన్న ఆలోచన లేదు..' అని ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పేసింది వర్ష బొల్లమ్మ. కాగా, వర్ష బొల్లమ్మకి ఓ హాట్ ఆఫర్ వచ్చిందట తాజాగా. అది కూడా విజయ్ దేవరకొండ సినిమాలో. అయితే, ఆ సినిమా పట్టాలెక్కడానికి కొంత సమయం పట్టేలా వుందట.
వర్ష, విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ సరసన 'మిడిల్ క్లాస్ మెలోడీస్'లో నటించిన విషయం విదితమే. ఆ సినిమా టైమ్‌లోనే విజయ్ దేవరకొండ నుంచి ఆమెకు హామీ లభించిందంటూ టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. 'మిడిల్ క్లాస్ మెలోడీస్'లో వర్ష టాలెంట్‌ని చూసి, ఆమెకు మంచి బ్రేక్ ఇద్దామనే ఆలోచనలో విజయ్ దేవరకొండ వున్నాడని సమాచారం. మరోపక్క, వర్షకి 'మిడిల్ క్లాస్ మెలోడీస్' తర్వాత ఆఫర్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్ష బొల్లమ్మ, తాను గ్లామరస్ హీరోయిన్‌ని కూడా.. అన్పించుకునేందుకు కసరత్తులు ప్రారంభించిందని సమాచారం. చక్కని నటనకు, ఇంకాస్త గ్లామర్ తోడైతే.. అవకాశాలు పోటెత్తుతాయ్ మరి.!