బిగ్‌బాస్‌లో సడెన్‌గా ఓ బామ్మ ప్రత్యక్షమైంది. ఇంతకీ ఎవరీ బామ్మ.? వరుణ్ సందేశ్ అమ్మమ్మ. హౌస్మేట్స్ కుటుంబ సభ్యుల రాకలో భాగంగా వరుణ్ సందేశ్ అమ్మమ్మ హౌస్‌లోకి వచ్చింది. బామ్మంటే బామ్మ కాదు. భలే సందడి చేసిందిలే. మీరందరూ నా మనవడి లాంటి వాళ్లే అని చెప్పింది. స్టైల్‌గా కాఫీ తాగుతూ, బిగ్‌బాస్ గారూ మీరు మా ఇంటికి రావాలి అని ఆహ్వానించింది. అంతేకాదు, దీపావళి శుభాకాంక్షలు చెప్పడం ద్వారా, త్వరలో రానున్న దీపావళి గురించి హింట్ ఇచ్చింది. ఆ మాటకు 'దీపావళి వచ్చేస్తోందా బామ్మా.!' అంటూ శ్రీముఖి ఆశ్చర్యపోయింది.
బామ్మ ముచ్చట్లకు ఆమె చుట్టూ చేరి నవ్వులు పూయించారు హౌస్ మేట్స్. వీకెండ్ షోలో నాగార్జునను చూసి, నేనే నాగార్జునలా ఫీలైపోతాను.. అంటూ నవ్వించింది బామ్మ. ఇక కన్ఫేషన్ రూమ్ నుండి రాహుల్ ఎ్కడున్నావురా.? అని పిలిచింది. అమ్మ పిలుపుతో కన్ఫేషన్ రూమ్‌లోకి వెళ్లిన రాహుల్, ప్రేమతో అమ్మను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది.? తెలియాలంటే ఈ రోజు బిగ్‌బాస్ షో వీక్షించాల్సిందే.
ఇక శ్రీముఖి తరపు బంధువులు హౌస్‌లోకి రావాల్సి ఉంది. ఇప్పటికే ఏడుగురు కంటెస్టెంట్స్‌కి సంబంధించి శివజ్యోతి, వితిక, బాబా భాస్కర్, అలీ బంధువులు హౌస్‌లోకి వచ్చి వెళ్లారు. ఈ రోజు మిగిలిన రాహుల్, వరుణ్, శ్రీముఖి బంధువుల సందడి చూడాల్సి ఉంది. స్టే ట్యూన్డ్ బిగ్‌బాస్.