వరుణ్ సందేశ్ అంటే... రొమాంటిక్ హీరోనే. `హ్యాపీడేస్`, `కొత్త బంగారు లోకం` లాంటి హిట్లతో ఒక్కసారిగా దూసుకొచ్చాడు. కానీ... ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయాడు. ఇండియాలో తక్కువ.. యూఎస్ లో ఎక్కువ ఉంటాడని, ప్రొడ్యూసర్లు కూడా వరుణ్ నిలైట్ తీసుకోవడం మొదలెట్టారు. కొత్తతరం ఉధృతిలో వరుణ్ అస్సలు ఎక్కడా కనిపించకుండా పోయాడు.
ఇప్పుడు సడన్ గా... `ఇందువదన` అనే సినిమాతో తెరపైకొచ్చాడు వరుణ్. టైటిల్ బాగుంది. పోస్టర్లో వరుణ్ మేకొవర్ ఇంకా బాగుంది. అసలు చూస్తోంది వరుణ్ సందేశ్ నేనా? అనిపించేలా వుంది. కండలు పెంచాడు. మీస కట్టు కూడా మార్చాడు. హ్యాపీడేస్ వరుణ్‌కీ, ఇందు వదన వరుణ్ కి చాలా తేడా చూపించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా.. డిఫరెంట్ గా ఉంటుంది.
పోస్టర్‌లోనే రొమాన్స్ కనిపిస్తోంది. ఎయిటీస్ బ్యాక్ డ్రాప్ లో సినిమానేమో అనిపించేలా ఉంది పోస్టర్. ఎం.ఎస్.ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో... ఫర్నాజ్ శెట్టి కథానాయిక. మరి... ఈ కొత్త ప్రయత్నం ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.